ట్విట్టర్: కరోనా లాక్డౌన్ కారణంగా స్టార్స్ అందరూ గత నాలుగు నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. కొత్త స్క్రిప్టులు వినడం, చేస్తున్న సినిమా స్క్రిప్టుకి మెరుగులు దిద్దడం లాంటివి చేస్తున్న కూడా ఎక్కువ సమయం ఫ్రీగా గడుపుతున్నారు. కొందరు ఫ్యామిలి తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, కొందరు కిచెన్ లో కొత్త వంటకాలు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇన్నాళ్లలో చూడని సినిమాలు, వెబ్ సిరీస్ లని ఇప్పడు వీక్షిస్తూ వాచ్ లిస్ట్ లో చెక్ పెట్టుకుంటున్నారు. ఇలా సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ తమకి బాగా నచ్చిన లేదా బాగా ఇంప్రెస్స్ చేసిన సినిమాని లేదా సిరీస్ ని అభిమానులకి కూడా సజెస్ట్ చేస్తున్నారు.
ఇదివరకే నాగ చైతన్య ‘చెర్నోబైల్’ అనే వెబ్ సిరీస్ సజెస్ట్ చేసాడు. అదే దారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నెట్ఫ్లిక్ ఓటీటీ లో అందుబాటులో ఉన్న ‘డార్క్‘ అనే వెబ్ సిరీస్ సజెస్ట్ చేసాడు. అద్భుతమైన రచన తో ఊహకందని కథనం తో చాలా ఆకట్టుకుందని పోస్ట్ పెట్టారు. అలాగే ఒరిజినల్ జర్మన్ వెర్షన్ లో సబ్ టైటిల్స్ తో చూడమని నొక్కి మరీ చెప్పాడు.