దుబాయ్: టి20 ప్రపంచకప్‌లో ఇవాళ జరిగిన వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి వరకు విజయం దోబూచులాడి టీ20 మజాను అందరికీ పంచింది. చివరి ఓవర్ దాకా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ కేవలం మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది.
వెస్టిండీస్ నిర్దేశించిన 143 పరుగుల సాధారణ లక్ష్యాన్ని బౌలర్ల చలువతో కాపాడుకుంది. ప్రధానంగా డెత్ ఓవర్స్‌లో డ్వేన్ బ్రావో, రవి రాంపాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆఖరి ఓవర్లో బంగ్లాదేశ్ విజయానికి 13 పరుగులు అవసరం అవగా రసెల్ అద్బుతంగా బౌలింగ్ వేశాడు. చివరి బంతికి నాలుగు పరుగులు అవసరం కాగా, యార్కర్ విసరడంతో మహ్మదుల్లా ఫ్లిక్ చేయడంలో విఫలమయ్యాడు.
ఆ బంతితో విండీస్ థ్రిల్లింగ్ విక్టరీతో సెమీస్ రేసులో నిలబడగా, ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవడంతో బంగ్లాదేశ్ ప్రపంచ కప్ నుండి వైదొలిగింది. ఇలా తక్కువ పరుగుల తేడాతో విండీస్ గెలవడం ఇది మూడోసారి. ఇంతకముందు 2011లో పాకిస్తాన్‌పై 7 పరుగుల తేడాతో, భారత్‌పై 2016లో కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం సాధించడం విశేషం.
ఈ సారి డిపెండింగ్ చాంపియన్ హోదాలో టీ20 ప్రపంచకప్ లో దిగిన విండీస్ ఇంగ్లండ్ మరియు దక్షిణాఫ్రికా చేతిలో వరుస ఓటములు ఎదురయ్యాయి. ఇవాళ బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మాత్రం విండీస్ తొలిసారి డిపెండింగ్ చాంపియన్ ఆటతీరును కనబరిచింది.