వాషింగ్టన్: సోషల్ మీడియాలో ప్రముఖమైన మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం వరకు వాట్సాప్ లో వీడియోను షేర్ చేసేటప్పుడు దాని ఆడియోను నిలిపివేసే అవకాశం అందుబాటులో లేదు. అలాంటి సమయంలో అభ్యంతర కరమైన వ్యాఖ్యలు, అసహ్యమైన మాటలు ఉంటే చాలామంది ఇబ్బంది పడేవారు.
ఇక పై ఈ కొత్త వెసులుబాటు తో వచ్చిన కొత్త వెర్షన్‌లో వీడియో మ్యూట్ చేసుకునే సౌకర్యాన్ని వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వల్ల అనవసరమైన ఆడియోను తీసేసి సంబంధిత వీడియోను మాత్రమే షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ ఫీచర్ ను చాలా సులువుగా వాడుకోవచ్చు. మీరు వీడియోని స్టేటస్ లో షేర్ చేయాలనీ అనుకున్నప్పుడు సదరు వీడియోను ఎంచుకొన్న వెంటనే దానికింద సౌండ్ సింబల్ ఒకటి కనిపిస్తుంది. దానిని సింపుల్‌గా మ్యూట్ చేసేస్తే ఆ వీడియో రిసీవ్ చేసుకునే వారికి ఎలాంటి ఆడియో లేకుండా వీడియో మాత్రమే వెళ్తుంది.
ఇప్పటికే కొంతమంది వాట్సాప్ యూజర్లకు ఈ అప్‌డేట్ అందుబాటులోకి కూడా వచ్చేసింది. మీకు కనుక ఈ ఫీచర్ రాకపోతే ఒకసారి మీ వాట్సాప్ అప్డేట్ చేసుకోండి. అలాగే కొత్తగా తీసుకురానున్న ప్రైవసీ పాలసీపై కూడా వాట్సాప్ బృందం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.