fbpx
Saturday, November 30, 2024
HomeLife Styleషాపింగ్ బటన్ ని ప్రవేశపెట్టిన వాట్సాప్

షాపింగ్ బటన్ ని ప్రవేశపెట్టిన వాట్సాప్

WHATSAPP-ROLLSOUT-SHOPPING-BUTTON

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా దిగ్గజం అయిన ఫేస్‌బుక్‌ యొక్క వాట్సాప్‌ మరో కీలక ఫీచర్‌కు తెర తీసింది.ఇటీవల పేమెంట్‌ సేవలను ఘనంగా ప్రారంభించిన వాట్సాప్‌ తాజాగా ఈ-కామర్స్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తూ యూజర్లకు శుభవార్త చెప్పింది. వాట్సాప్ ప్లాట్‌ఫాంపై షాపింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు ప్రత్యేకంగా షాపింగ్ బటన్‌ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త ఫీచర్ ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించింది.

బిజినెస్ అకౌంట్స్ ఉన్న వాట్సాప్‌ యూజర్లు కేటలాగ్‌లో ఉన్న ప్రొడక్ట్స్‌ని ఓపెన్ చేసి నచ్చితే వెంటనే వాట్సప్‌లోనే కొనుగోలు చేసుకోవచ్చని వాట్సాప్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది ఉత్పత్తులను కనుగొనడం సులభతరం చేస్తుందనీ, అలాగే అమ్మకాలను పెంచడానికి సహాయపడుతుందని పేర్కొంది.

ఇప్పటివరకు బిజినెస్‌ ప్రొపైల్‌ ఓపెన్‌ చేసి తమకు నచ్చిన వస్తువు కేటలాగ్ లిస్ట్‌లో చెక్‌ చేసుకోవాల్సి వచ్చేంది. తాజాగా షాపింగ్‌ బటన్‌ను విడుదల చేసింది. ఈ షాపింగ్ బటన్ వాయిస్ కాల్ బటన్ స్థానంలో ఉంటుంది. అయితే వినియోగదారులు వాయిస్ లేదా వీడియో కాల్‌ను ఎంచుకోవడానికి కాల్ బటన్‌ను నొక్కాలి. తద్వారా వ్యాపారులు తమ సేల్స్ పెంచుకోవడానికి ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది.

వాట్సాప్‌ సమాచారం ప్రకారం ప్రస్తుతం రోజూ వాట్సప్ బిజినెస్ అకౌంట్‌లో 17.5 కోట్ల మంది మెసేజెస్ పంపిస్తున్నారు. దేశంలో 30 లక్షల మందితో సహా, ప్రతీ నెలలో 4 కోట్ల మంది బిజినెస్ క్యాటలాగ్ చూస్తున్నారని తెలియజేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular