టాలీవుడ్: సినిమా మీద పాషన్ తో ఎంతో మంది ఇండస్ట్రీ లో అడుగుపెడుతూ ఉంటారు. ఒక్కొక్కరు తమకి తోచిన, తమకి సంబందించిన రంగాల్లో పరిణతి సాధించి ఒక వెలుగు వెలుగుతుంటారు. అందులో నిర్మాతలు కూడా ఒకరు. తమకి ప్రత్యేక అభిరుచి ఉందని సినిమా కోసం ఏదైనా చేయగలమని ఎంతైనా పెట్టగలమని, లాభాపేక్ష లేకుండా సినిమా ఆడితే చాలు అనుకుని మంచి మంచి సినిమాలు, హై బడ్జెట్ సినిమాలు రూపొందించిన ఒకప్పటి కొందరు నిర్మాతలు ఇపుడు ఏమయ్యారు అనే అంశం పై ఈ పోస్ట్ పెడుతున్నాం.
తెలుగులో ఎన్ఠీఆర్ కాలం నుండి సినిమాలు తీస్తూ ఎన్నో క్లాసిక్ మూవీస్ అందించిన నిర్మాత అశ్వినీదత్. చిరంజీవి తో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి తరాలు మారిన మరచిపోలేని క్లాసిక్ సినిమాలు రూపొందించిన అశ్విని దత్ కాల క్రమేణా ఇండస్ట్రీ లో వచ్చిన మార్పులు చూసి, మధ్యలో కొందరు బడా హీరోలతో వచ్చిన వరుస ప్లాపుల తర్వాత ఇండస్ట్రీ లో ఎక్కువగా సినిమాలు చేయడం తగ్గించాడు. తమ కూతుళ్ళ ప్రొడక్షన్ ద్వారా అప్పుడప్పుడు పలకరిస్తున్నా కూడా అశ్విని దత్ లెవెల్ లో ‘మహానటి’ రూపొందించి మరో క్లాసిక్ సినిమాని అందించారు. ప్రస్తుతం ప్రభాస్ తో మరో పాన్ వరల్డ్ సినిమాని రూపొందిస్తున్నారు.
టాలీవుడ్ లో సంక్రాతి రాజు గా పిలవబడే ఎం.ఎస్.రాజు ఒక టైం లో వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు సాధించాడు. వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మనసంతా నువ్వే లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలని రూపొందించిన నిర్మాత ప్రస్తుతం దర్శకుడిగా వేరే ప్రొడక్షన్ హౌసెస్ లో చిన్న సినిమాలు చేస్తున్నాడు. తన సినిమాల్లో ఖర్చుకు ఏమాత్రం వెనకపడకుండా చూసుకునే ఈ నిర్మాత కొన్ని ప్లాపులకి చతికిలపడిపోయాడు. తన సినిమా కోసం చార్ మినార్ సెట్ ని వేసి మొదటి సారి భారీ బడ్జెట్ తో సెట్ వేసి సినిమా రూపొందించిన ఈ పాషన్ ఉన్న నిర్మాత మళ్ళీ నిర్మాణం వైపు చూడలేదు.
తమిళ్ తో పాటు తెలుగులో కూడా శంకర్ సినిమాలు బాగా ఫేమస్. ఎస్.ఎస్.రాజమౌళి కన్నా ముందు సౌత్ నుండి పాన్ ఇండియా లెవెల్ సినిమాని రూపొందించే కెపాసిటీ ఉన్న దర్శకుడు శంకర్. 90 ల్లోనే భారీ బడ్జెట్ సినిమాలని రూపొందించాడు ఈ డైరెక్టర్. ఒక్క తమిళ్ లాంగ్వేజ్ బేస్ చేసుకుని భారీ బడ్జెట్ సినిమాలని రూపొందించేవాడు. 2000 సంవత్సరం లో రూపొందించిన బాయ్స్ సినిమా వరకు శంకర్ సినిమాలు అన్ని సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ.ఎం.రత్నం రూపొందించేవారు. నిజం చెప్పాలంటే శంకర్ సినిమాలన్నీ హై బడ్జెట్ సినిమాలే. కొన్ని సార్లు ఒక్కో పాటకి కోటి రూపాయలు బడ్జెట్ ఉండేది శంకర్ సినిమాల్లో. ఆ టైం లో ఆ బడ్జెట్ తో ఒక సినిమానే తియ్యొచ్చు. అయినా కూడా ఎక్కువ లాభం ఆశించకుండా పాషన్ తో సినిమాలని రూపొందించేవారు ఏ.ఎం.రత్నం. తర్వాత ఇండస్ట్రీ లో వస్తున్న మార్పులకి తట్టుకోలేక, కొన్ని ప్లాప్ లని ఎదుర్కొని నిర్మాతగా సినిమాలు మానేసాడు. ప్రస్తుతం తెలుగులో ఏ.ఎం.రత్నం కి మరచిపోలేని హిట్ ని ‘ఖుషి’ రూపంలో అందించిన పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీర మల్లు’ సినిమాని నిర్మిస్తున్నాడు.
ఇలా సినిమాపై పాషన్ ఉండి ఎక్కువ లాభాపేక్ష లేకుండా మంచి సినిమాలని రూపొందించిన అభిరుచి ఉన్న నిర్మాతలు ఇంకా చాల మంది ఉన్నారు. అందులో కొందరు వీళ్ళు. వీళ్ళు ప్రస్తుతం చేపట్టిన సినిమాలు ఫ్యూచర్ లో చేయబోయే సినిమాలు మళ్ళీ బ్లాక్ బస్టర్ లు సాధించి ఇండస్ట్రీ లో మరిన్ని క్లాసిక్ సినిమాలు అందించి కొత్తగా వచ్చే వాళ్ళకి మార్గదర్శకంగా నిలవాలని ఆశిద్దాం.