హైదరాబాద్: మంచు లక్ష్మి! టాలీవుడ్‌లో మంచు కుటుంబ వివాదాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
మోహన్ బాబు, మనోజ్, విష్ణు మధ్య ఆస్తి వివాదాలు మరింత ముదురుతున్నాయని సమాచారం. కానీ ఈ గందరగోళంలో మంచు లక్ష్మి పేరు ఎక్కడా వినిపించడం లేదు.
గత కొంతకాలంగా ఈ గొడవలకు దూరంగా ఉంటూ, మంచు లక్ష్మి తన జీవితాన్ని ముంబైలో స్థిరపరచుకున్నారు.
హోమ్ టూర్లు, హై ప్రొఫైల్ పార్టీల్లో పాల్గొంటూ, సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ ఆమె తన జీవితాన్ని కొత్త దిశలో కొనసాగిస్తున్నారు.
ఇటీవల కుటుంబంలో విభేదాలు పెరుగుతుండటంతో ఆమె హుటాహుటిన హైదరాబాద్‌కి చేరుకుని తండ్రి, సోదరులతో ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
అయితే, ఎవరు కూడా తమ వైఖరిని మార్చేందుకు సిద్ధంగా లేనందున లక్ష్మి ఈ గొడవల నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
మనోజ్ రెండో పెళ్లి సమయంలో కుటుంబానికి మద్దతుగా నిలిచిన లక్ష్మి, ఇప్పుడు పరిస్థితులు మరింత ఆగ్రహంగా మారతాయని భావించి, ఏ వైపు ఉండకుండా సైలెంట్ గా ఉంటున్నారని తెలుస్తోంది.
తండ్రి మోహన్ బాబుతో ఆస్తుల విషయంలో ఏ సమస్య లేకపోయినా, లక్ష్మి ఈ వ్యవహారాలకు దూరంగా ఉండటానికి నిర్ణయించుకున్నారని టాక్.
ఇక ఈ కుటుంబ కలహాలు ఎక్కడ ఆగుతాయో వేచి చూడాల్సిందే.