టాలీవుడ్: కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన పాత్రలు మాత్రమే కాకుండా హోస్ట్ గా కూడా మెప్పించాడు దగ్గుబాటి రానా. తన కెరీర్ స్టార్ట్ చేయడమే ‘లీడర్’ లాంటి ఒక ప్రయోగం తో స్టార్ట్ చేసారు. ‘విరాట పర్వం’, ‘అరణ్య’ సినిమాలతో బిజీ గా ఉన్న రానా డిస్కవరీ వారి మిషన్ ఫ్రంట్ లైన్ ప్రోగ్రాం కోసం కోసం ఒక రోజు రియల్ జవాన్ జర్నీ చేసారు. ఇపుడు హోస్ట్ గా కూడా ఒక కొత్త రకమైన ప్రయోగం చేస్తున్నాడు. ఇది ఒక యానిమేషన్ హోస్ట్ సిరీస్. దీని పేరు ‘వై అర్ యూ‘ అని ఇదివరకే లాంచ్ చేసారు. ఇందులో భాగంగా రానా ఒక రియల్ పర్సన్ ని ఇంటర్వ్యూ చేసి దానిని యానిమేషన్ రూపం లో విడుదల చేస్తారు. డైరెక్ట్ పర్సన్ ని ఇంటర్వ్యూ చేసి దానిని యానిమేషన్ రూపం లో విడుదల చేయడం కొత్తగా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది.
ఈ యానిమేషన్ సిరీస్ మరి కొద్దీ రోజుల్లో మొదలవనుంది. దీనికి సంబంధించి ప్రమోషనల్ మరియు ఇంటర్వూస్ కి సంబంధించి రానా ఒక కాంటెస్ట్ పెట్టబోతున్నాడు. WHY ARE YOU (నువ్వే ఎందుకు) అని ఒక 60 సెకన్ల లోపు ఒక వీడియో తయారు చేసి ఈ కాంటెస్ట్ లో పాల్గొంటే అది తమకి నచ్చితే రానా తో పాటు ఇంటర్వ్యూ లో పార్టిసిపేట్ అంటే రానా చేత ఇంటర్వ్యూ చేయబడతారు. విసువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ఓనర్ గా, హీరోగా, ప్రొడ్యూసర్ గా, హోస్ట్ గా అలరించిన రానా ఇందులో కూడా సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.