టాలీవుడ్: అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘వైల్డ్ డాగ్’. ఈ సినిమా టీజర్ ఈరోజు విడుదల చేసింది సినిమా టీం. టీజర్ లో అసలు సినిమాలో ఏం చూపించబోతున్నాం, సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏంటి, సినిమాలో హీరో కారెక్టర్ ఏంటి, హీరో ఎలాంటి ఆపరేషన్స్ చేయబోతున్నాడు అని ఒక నిమిషం వీడియో లో చూపించారు.
ఈ సినిమాలో నాగార్జున విజయ్ వర్మ అనే పవర్ఫుల్ NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఆఫీసర్ గా పని చేస్తున్నారు. వీడియో లో దేశం లో జరిగిన వివిధ టెర్రరిస్ట్ అటాక్స్ , అటాక్స్ తర్వాత దొరికిన టెర్రరిస్టులని ఎలాంటి కారణాల వలన విడుదల చేసారు, విడుదల చేసిన తర్వాత వాళ్ళు మన దేశంలో మళ్ళీ ఎలాంటి అటాక్స్ చేసారు. దొరికిన టెర్రరిస్టులని ఏం చేస్తున్నారు, వాళ్ళని ఎలా చూస్తున్నారు లాంటివి హైలైట్ చేసి ‘ఒకడు మన దేశంలో వందల మందిని చంపి మీరు నన్నేమీ చేయలేరు అంటే ఐ యామ్ నాట్ ఓకే విత్ దట్..’ అంటూ ‘ఇది చేస్తోంది మన దేశంలో భయంతో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి కోసం’ అని నాగ్ చెప్పే డైలాగ్ తో సినిమా థీమ్ తెలియ చేసారు.
ఈ సినిమాలో ‘విజయ్ వర్మ డీల్ చేసిన ఏ కేసులో కూడా ఎవరూ ప్రాణాలతో మిగలలేదు’ లాంటి డైలోగ్స్ తో అంతే కాకుండా ఇంతకముందు విడుదల చేసిన టీజర్ లో దొరికిన టెర్రరిస్ట్స్ అరెస్ట్ అన్న కూడా వాళ్ళని చంపే సీన్స్ తో విజయ్ వర్మ కారెక్టర్ ఎలా ఉండబోతుందో తెలియచేసారు.
మాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 2 న థియేటర్లలో విడుదల అవబోతుంది.