మూవీడెస్క్: యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో ఇప్పటి వరకు సరైన కమర్షియల్ హిట్ అందుకోలేదు.
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో ఫస్ట్ హిట్ కొట్టినా, పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ‘ఏజెంట్’ మూవీ పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
ఇక, కొత్త ప్రాజెక్ట్స్‌పై అఖిల్ ఎంతో జాగ్రత్తగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అఖిల్ పీరియాడికల్ డ్రామా మరియు సరికొత్త కథాంశంతో ఉన్న మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ రెండు సినిమాలు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌లో రూపొందనున్నాయి.
ఒకటి యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఉండగా, మరొకటి అన్నపూర్ణ స్టూడియోస్‌పై వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమయంలో, అభిమానులు పెద్ద బడ్జెట్ సినిమాలు మరోసారి రిస్క్ అని అభిప్రాయపడుతున్నారు.
‘ఏజెంట్’ వల్ల అఖిల్ కి వచ్చిన నష్టాలు గుర్తుచేస్తూ, ఇప్పుడు మాత్రం మంచి కంటెంట్‌తో తక్కువ బడ్జెట్‌లో విజయాన్ని సాధించాలనే సలహాలు ఇస్తున్నారు.
మరి ఈ కొత్త ప్రాజెక్టులు అఖిల్ కెరీర్‌లో కీలక మలుపు అవుతాయా లేదా అనేది వేచి చూడాలి.