మూవీడెస్క్: సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ విడుదలకు సిద్ధమవుతోంది.
ట్రైలర్ ద్వారా భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా, బాలయ్యకు మరో బ్లాక్‌బస్టర్ హిట్ తీసుకొస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలయ్య, ఈ సినిమాతో 100 కోట్ల షేర్ క్లబ్‌లో చేరతాడనే టాక్ నడుస్తోంది.
కెరీర్ టాప్ రికార్డ్స్
‘వీరసింహారెడ్డి’తో మొదటి రోజు 25.35 కోట్ల షేర్ సాధించిన బాలయ్య, ఆ రికార్డును ‘డాకు మహారాజ్’తో బ్రేక్ చేస్తాడని ట్రేడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
‘అఖండ’ 15.39 కోట్ల షేర్‌తో రెండో స్థానంలో ఉండగా, ‘భగవంత్ కేసరి’ 14.36 కోట్ల షేర్‌తో మూడో స్థానంలో నిలిచింది.
‘డాకు మహారాజ్’కు భారీ థియేట్రికల్ బిజినెస్ జరగడం, సంక్రాంతి సీజన్ కలిసిరావడం సినిమాకు బాగా ప్లస్ అవుతాయని భావిస్తున్నారు.
విడుదల రోజున తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎంతటి షేర్ సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాతో బాలయ్య తన కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధిస్తే, సంక్రాంతి బరిలో మరో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.
ఫ్యాన్స్ ఇప్పుడు ఈ రికార్డు కోసం ఎదురు చూస్తున్నారు.