మూవీడెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 (PUSHPA 2)మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1830 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
నెలరోజులు గడిచినప్పటికీ థియేటర్లలో నిలకడగా కలెక్షన్లు రాబడుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా వసూళ్లు క్లోజింగ్ దశకు చేరుకున్నాయి.
ఇక గేమ్ చేంజర్ విడుదలకు దగ్గరపడుతున్న తరుణంలో అందరి దృష్టి ఈ సినిమా వైపు మళ్లుతోంది.
ఇండియన్ బాక్సాఫీస్‌లో ప్రస్తుతం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 నిలిచింది.
రెండో స్థానంలో బాహుబలి 2 ఉండగా, దంగల్ సినిమా 2000 కోట్ల క్లబ్‌లోకి చేరినప్పటికీ, అందులో 1450 కోట్లు చైనాలో మాత్రమే వసూలయ్యాయి.
చైనా మార్కెట్‌లో రిలీజ్ చేసి మరింత భారీ వసూళ్లు సాధించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
చైనాలో ఎర్రచందనం ప్రాముఖ్యత ఉన్నందున అక్కడ మంచి రన్ ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సినిమా చైనాలో హిట్ అయితే దంగల్ రికార్డును బ్రేక్ చేయడం ఈజీ అవుతుందని అంటున్నారు.
దీంతో తెలుగు సినిమా దశ తిరిగి మరో మైలురాయిని చేరవచ్చని అభిప్రాయపడుతున్నారు.
మహేష్ బాబు-రాజమౌళి ప్రాజెక్ట్, సలార్ 2, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలు కూడా 2000 కోట్ల క్లబ్‌లోకి చేరే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.