మూవీడెస్క్: టాలీవుడ్లో భారీ అంచనాలతో విడుదలైన గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ సినిమా వల్ల నిర్మాత దిల్ రాజు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
ఇండస్ట్రీ వర్గాల అంచనా ప్రకారం, ఈ ప్రాజెక్ట్ దిల్ రాజుకు కనీసం 120 కోట్లకు పైగా నష్టం మిగిల్చిందని చెబుతున్నారు.
సాధారణంగా ఇలాంటి పెద్ద ఫెయిల్యూర్స్ తర్వాత హీరోలు లేదా దర్శకులు మరో సినిమా చేయడానికి ముందుకు వస్తుంటారు.
ఈ క్రమంలో రామ్ చరణ్, దిల్ రాజుకు మద్దతుగా మరో సినిమా చేయనున్నారనే వార్తలు హల్చల్ చేశాయి. కానీ, చరణ్ టీమ్ దీనిపై స్పష్టత ఇచ్చింది.
ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు సినిమా చేస్తున్నారని, అది 2025 వరకు పూర్తవుతుందని తెలిపారు.
ఆ తర్వాత చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేయబోతుండటంతో, దిల్ రాజు కోసం మరో ప్రాజెక్ట్ చేయడం అసాధ్యమని క్లారిటీ ఇచ్చారు.
దీంతో, రామ్ చరణ్ – దిల్ రాజు కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందా? అనే అనుమానాలు తలెత్తాయి.
అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో దిల్ రాజు తన నష్టాలను కొంతవరకు కవర్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇకపై ఆయన చిన్న, మధ్య తరహా సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.