మూవీడెస్క్: టాలీవుడ్‌లో క్యూట్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల, తన డాన్స్ టాలెంట్‌తో ప్రత్యేకమైన గుర్తింపును సాధించారు.
ముఖ్యంగా పుష్ప 2 లోని “కిసిక్” పాట ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా మారింది.
ఈ పాటలో ఆమె ఎనర్జీ, డాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ పాట, బాలీవుడ్ సర్కిల్స్‌లోనూ చర్చకు దారితీసింది.
కిసిక్ సాంగ్ విడుదల తర్వాత బాలీవుడ్ నుంచి శ్రీలీలకు ప్రత్యేకమైన ఆఫర్స్ వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ముఖ్యంగా ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లు ఆమెను ఐటమ్ సాంగ్స్ కోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం.
బాలీవుడ్‌లో నోరా ఫతేహి, మలైకా అరోరా వంటి స్టార్ డాన్సర్ల సరసన శ్రీలీలను గుర్తించడం గర్వకారణంగా చెప్పొచ్చు.
ఈ అవకాశాలు ఆమెను పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందే దిశగా తీసుకెళ్లే ఛాన్స్‌గా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే, శ్రీలీల ఇప్పటివరకు తన కెరీర్‌ను హీరోయిన్స్ రేంజ్‌లో నిర్మించుకుంటూ ముందుకెళ్తున్నందున, ఐటమ్ సాంగ్స్ ఆమె కెరీర్‌కు ఎంతవరకు కలిసివస్తాయనే చర్చ కూడా జరుగుతోంది.
టాలీవుడ్‌లో ఇప్పటికే టాప్ హీరోయిన్‌గా మారుతున్న ఆమె, ఐటమ్ నంబర్లతో బ్రాండ్ డామేజ్‌కు గురవుతుందా? లేక కొత్త చాన్స్‌లను సొంతం చేసుకుంటుందా? అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.