మూవీడెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలకు ఏపీ ప్రభుత్వం టిక్కెట్ ధరల పెంపుపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రీమియర్ షోలు సహా 14 రోజుల పాటు టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి లభించింది.
సంక్రాంతి సీజన్‌లో ఈ నిర్ణయం బాక్సాఫీస్ వద్ద పెద్ద కలెక్షన్లు తీసుకురాగలదని మేకర్స్ ఆశిస్తున్నారు.
తాజాగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టిక్కెట్ హైక్‌పై మాట్లాడుతూ, పెంచిన ధరల వల్ల 18% జీఎస్టీ ప్రభుత్వానికి వెళుతుందని, పెద్ద బడ్జెట్ సినిమాలకి ఇది మద్దతుగా ఉంటుందని అన్నారు.
సినిమా స్థాయిని గ్లోబల్ లెవెల్‌కి తీసుకెళ్లాలంటే ఈ పెంపు అవసరమని పేర్కొన్నారు.
అయితే టిక్కెట్ రేట్ల హైక్‌ను 14 రోజులకే పరిమితం చేస్తుందనుకున్న ప్రభుత్వం, తాజాగా 10 రోజులకు మాత్రమే అనుమతి ఇస్తూ జీవో సవరణ చేసింది.
ఈ మార్పు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కానీ 10 రోజులు పెద్ద సినిమాలకి తగినంత సమయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక తెలంగాణలో కూడా ప్రభుత్వం ధరల పెంపునకు మరియు ఎక్కువ షోలకు కూడా అనుమతి ఇచ్చింది.