న్యూ ఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ భక్తి పై ఆన్లైన్ షార్ట్ ఫిలిం కాంపిటీషన్ జరిగింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మరియు జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ పోటీని నిర్వహించాయి. ప్రజలలో దేశ భక్తి భావాన్ని పెంపొందించడానికి ఆత్మనిర్భరత భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ మాధ్యమాన్ని ఎంచుకున్నారు గవర్నమెంట్.జులై 14వ తేదీ నుంచి ఆగష్టు 7వ తేదీ వరకు ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు.”దేశ భక్తి, దేశ ప్రగతి, ఆత్మ నిర్బర్ భారత్” ప్రధానాంశాలుగా షార్ట్ ఫిల్మ్స్‌ని నిర్మించాలని పేర్కొంది. ఈ మేరకు ఈ పోటీలో విజయం సాధించిన విజేతలను కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలను అభినందిస్తూ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు.
‘ఆమ్ ఐ ‘, ‘అబ్ ఇండియా బనేగా భారత్’, ’10 రూపీస్’ సినిమాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇంకా కొన్ని చిన్న సినిమాలకి స్పెషల్ మెన్షన్ అవార్డులు లభించాయి. అందులో రామ్ కిషోర్ రూపొందించిన ‘సోల్జర్’ అనే ఒక తెలుగు బేస్డ్ సినిమా కూడా ఉంది. అలాగే ఈ పోటీ చాలా విజయవంతం అయిందని ఈ పోటీలో పాల్గొన్న వాళ్లందరికీ శుభాకాంక్షలు తెలియ చేసారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్.