న్యూఢిల్లీ: పెళ్ళై విడాకులు తీసుకున్న ఒక మహిళ తన భర్తకు కావాల్సిన అర్హతలు 30 లక్షల ప్యాకేజి, అత్త మామలు ఉండొద్దు అనే కోరిక వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే: ఒక మహిళ, ఇది వరకే పెళ్ళై, విడాకులు తీసుకున్న ఆమె, బీఈడి చదువుకుని నెలకు పదివేల రూపాయల వరకు సంపాదిస్తోంది.
ఆమె తన భర్తకు కావాల్సిన అర్హతలు పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది. అలానే అది తీవ్ర చర్చకు దారి తీసింది.
ఆమె కోరుకున్న అర్హతల వివరాలు ఇలా:
- వరుడు కనీసం 30 లక్షల ప్యాకేజీ ఉన్న వాడై ఉండాలి.
- తన పేరున 3 BHK నివాస భవనం ఉండాలి.
- ఒక వేళ అమెరికాలో ఉద్యోగం చేస్తుంటే కనీసం 80 లక్షల ప్యాకేజి ఉండాలి.
- అత్త మామలు ఉండొద్దు.
- వీళైతే అమ్మాయి వాళ్ళ నాన్న అమ్మ కూడా తనతోనే ఉండే అవకాశం ఉంది.
- అబ్బాయి ఎంబీఏ, లేదా ఎమ్మెస్ చేసి ఉండాలి.
- తనకు ట్రిప్స్ ఇష్టమని, 5 స్టార్ హోటల్స్ లో ఉండడం ఇష్టమని తైపింది.
- ఇంకా ఇంటి పనులు చేయడం తన పని కాదు అని కూడా స్పష్టతను ఇచ్చింది.
ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవడంతో ప్రజలు వివిధ రకాల కామెంట్లు పెడుతున్నారు.
కాగా ఈ పోస్ట్ కు 1.5 మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం.