హైదరాబాద్ : కరోనా నుంచి కాపాడడనికి వేస్తున్న వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొంతమంది అస్వస్థతకు గురవుతున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే మహారాష్ట్రలో వాక్సిన్ తీసుకున్న ఏడు మందికి ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి లక్షణాలతో ఆసుత్రుల్లో సోమవారం చేరారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ రాజధాని హైదరబాద్లోనూ ఇలాంటి పరిణామాలు వెలుగులోకి వచ్చాయి.
కోవిషీల్డ్, కోవిడ్ వ్యాక్సిన్ రియాక్షన్ కావడంతో ఓ మహిళ గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఈ జనవరి 16వ తీదీన నవీన అనే మహిళ ఉప్పల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే అనుకోకుండా ఆమెకు వాంతులు, మైకం కమ్మడం, బలహీన లక్షణాలు కనిపించడటంతో ఈ రోజు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం నవీన పరిస్థితి నిలకడగా ఉందని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.
శనివారం భారతదేశమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, ఫ్రంట్లైన్ యోధులకు టీకా ఇచ్చారు. పలు మెడికల్ సెంటర్లలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను అందజేశారు. మొత్తం 3 కోట్ల మంది హెల్త్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు.