అంతర్జాతీయం: అమెరికా దెబ్బకు జిన్ పింగ్ యూటర్న్!
భారత్‌తో సంబంధాలపై చైనా ధోరణిలో మార్పు
భారత్-చైనా (India-China) సంబంధాలు ఈమధ్య కాలంలో ఎప్పుడూ సవ్య దిశలో ముందుకు సాగలేదు. పాక్ (Pakistan) కు పరోక్ష మద్దతు, సరిహద్దు ఉద్రిక్తతలు, ఆర్ధిక సంబంధాల్లో అవిశ్వాసం… ఇవన్నీ చైనాతో ఉన్న భారత్ పరిస్థితిని నిత్యం ఉద్రిక్తతలు పెంచాయి. అయితే తాజా పరిణామాలు మారిన దశగా కనిపిస్తున్నాయి.
ట్రంప్ దెబ్బతో మారిన చైనా దిశ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల చైనాపై భారీ ప్రతీకార చర్యలు చేపట్టారు. చైనా దిగుమతులపై ఏకంగా 125 శాతం టారిఫ్ సుంకాలు విధించడం గమనార్హం. దీని వల్ల చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికా మార్కెట్‌పై అధికంగా ఆధారపడి ఉన్న చైనా ఇప్పుడు ప్రత్యామ్నాయ వ్యూహాలు అన్వేషించాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది.
భారత్‌తో మైత్రికి సిద్ధమన్న జిన్ పింగ్
ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ (Xi Jinping) కీలక ప్రకటన చేశారు. బీజింగ్ (Beijing) లో నిర్వహించిన కేంద్ర కమిటీ హైలెవల్ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత్‌తో అభిప్రాయ భేదాలను తగ్గించుకునేందుకు, వ్యాపార సరఫరా వ్యవస్థలను పునర్నిర్మించుకునేందుకు చైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
జిన్ పింగ్ వ్యాఖ్యల ప్రకారం, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడానికి చైనా అంగీకరించనుందన్న సంకేతాలు వెలువడ్డాయి. ఇది గతంలో ఎప్పుడూ బయటపెట్టని దృక్పథం కావడం విశేషం.
భారత్ స్పందనపై ఆసక్తి
జిన్ పింగ్ ప్రకటనలపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ఇటీవల కాలంలో గాల్వాన్ లోయ (Galwan Valley) ఘటనల నేపథ్యంలో చైనాపై భారత్ అవిశ్వాసం కొనసాగుతున్నది. అయినప్పటికీ, వాణిజ్య మరియు పారిశ్రామిక విభాగాల్లో సహకారం సాధ్యమేనా అనే అంశంపై బాహ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) స్పందన కీలకంగా మారనుంది.