
కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ కెరీర్ కొత్త మలుపు తిరిగింది. రాకీ భాయ్ ఇమేజ్‌తో మాస్‌లో సత్తా చాటిన యష్, ఇప్పుడు 2026లో రెండు విభిన్న పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నితీశ్ తివారి తీస్తున్న రామాయణలో రావణుడిగా, గీతూ మోహన్ టాక్సిక్ లో డార్క్ మాస్ యోధుడిగా కనిపించనున్నాడు.
రావణుడి పాత్ర పవిత్ర పురాణ నేపథ్యం కలిగిన అద్భుతమైన ఛాలెంజ్. యష్ పర్సనాలిటీకి ఇది ఎంత వరకూ ఫిట్ అవుతుందన్నది ఆసక్తికరం. మళ్లీ టాక్సిక్ సినిమా అయితే కంప్లీట్ ఫిక్షనల్ స్టయిలిష్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది.
ఈ రెండు పాత్రలు ఒకే ఏడాదిలో విడుదల కావడంతో, యష్ పాన్ ఇండియా రేంజ్ మరోసారి టెస్టవ్వనుంది. కన్నడ బేస్‌తో టాక్సిక్ వస్తుండటంతో, బాలీవుడ్ మార్కెట్‌లో నిలవాలంటే ప్రమోషన్ స్ట్రాటజీ చాలా కీలకం.
కేజీఎఫ్ తర్వాత ఏర్పడ్డ మాస్ ఇమేజ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాలంటే, ఈ రెండు సినిమాల ట్రీట్మెంట్ బలంగా ఉండాలి. ప్రభాస్ కే బాహుబలి తర్వాత కల్కి 2898 ADతో మళ్లీ ఫామ్ వచ్చింది. ఇప్పుడు అదే ట్రాక్‌లో యష్ కూడా పావులు కదుపుతున్నాడు.
2026లో రామాయణ – టాక్సిక్ రెండు సినిమాలే యష్‌కు ‘గేమ్ చెంజర్’ అవుతాయా? లేక రాకీ భాయ్ మ్యాజిక్ మిగిలిపోతుందా అనేది చూడాలి.
yash, ramayana, toxic movie, pan india star, kgf,