fbpx
Friday, December 27, 2024
HomeMovie Newsటాక్సిక్‌లో సరికొత్త పాత్రలో యశ్

టాక్సిక్‌లో సరికొత్త పాత్రలో యశ్

YASH-IN-NEW-CHARACTER-IN-TOXIC
YASH-IN-NEW-CHARACTER-IN-TOXIC

మూవీడెస్క్: స్టైలిష్ హీరో యశ్, ‘కేజీఎఫ్’ సిరీస్ విజయంతో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆయన తన కొత్త చిత్రం ‘టాక్సిక్’ తో మరోసారి అలరించబోతున్నాడు.

మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా పలు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.

‘టాక్సిక్’ మూవీలో యశ్ అండర్ కవర్ ఆఫీసర్ రోల్ చేస్తాడని అనుకుంటున్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఆయన పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ పాత్రకు కోర్ట్ డ్రామా సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని, వాటి ద్వారా యశ్ పాత్రను బాగా ఎలివేట్ చేశారని సమాచారం.

కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌లపై భారీ బడ్జెట్‌తో నిర్మాణమవుతోన్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హూమా ఖురేషీ, డారెల్ డిసిల్వా వంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

జెరేమీ స్టాక్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది. యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ చిత్రాన్ని ఎదురుచూస్తున్నారు.

‘టాక్సిక్’ రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండడంతో సినిమా పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular