మూవీడెస్క్: ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తర్వాత రాకింగ్ స్టార్ యష్ మరోసారి తన యూనిక్ ప్రాజెక్ట్ లతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు.
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ పేరుతో ఓ పాన్ ఇండియా మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు.
భారీ బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మితమవుతుండగా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాని 2025 ఏప్రిల్ 10న విడుదల చేయాలని నిర్ణయించారు.
ఇక మరోవైపు బాలీవుడ్ లో ‘రామాయణం’ ప్రాజెక్ట్ లో యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు.
ఈ చిత్రాన్ని నితీష్ తివారి తెరకెక్కిస్తుండగా, యష్ నటించడమే కాకుండా నిర్మాణంలో భాగం అయ్యాడని తన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు.
లాస్ ఏంజిల్స్ లో నిర్మాణ భాగస్వామి నమిత్ మల్హోత్రాతో ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించి, ఆ సినిమా విజువల్స్ అద్భుతంగా ఉండబోతున్నాయని తెలిపారు.
‘‘ఇలాంటి కథలు మాస్ ఎంటర్టైన్ మెంట్ కి దూరంగా, సాహసంతో కూడిన కథగా ఉండాలి. ప్రేక్షకులను మరింత ఆకట్టుకోవడమే మా లక్ష్యం,’’ అని యష్ అన్నారు.
రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్న ఈ ‘రామాయణం’ పై భారీ అంచనాలు ఉన్నాయి..