మూవీడెస్క్: రాకింగ్ స్టార్ యష్, ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని, తాజాగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ సినిమా ప్రారంభించారు.
ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండగా, కథ డ్రగ్స్ స్మగ్లింగ్ నేపథ్యంపై సాగనుందని సమాచారం.
యష్ ఇందులో ఇంటర్నేషనల్ మాఫియా డాన్‌గా పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రంలో నయనతార, హ్యూమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తుండగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.
కియారాకు ఇదే మొదటి కన్నడ సినిమా కావడం విశేషం. యష్ పాత్రను గీతూ మోహన్ దాస్ చాలా స్టైలిష్‌గా డిజైన్ చేశారని టాక్.
అంతేకాక, సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కూడా బలంగా ఉండనుంది. నయనతార సిస్టర్ పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇక 2025 ఏప్రిల్ 10న సినిమా విడుదల కానుంది.
అయితే అదే రోజున ప్రభాస్ ‘ది రాజాసాబ్’ కూడా రిలీజ్ కావడంతో, ఈ రెండు పాన్ ఇండియా చిత్రాల మధ్య పోటీ బాక్సాఫీస్ వద్ద హీట్ పెంచుతాయని చెప్పవచ్చు.