యూపీ: ప్రధాని మోదీ రాజకీయ విరమణపై జరుగుతున్న ప్రచారానికి సంబంధించి, యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ రిటైర్ అయితే తనకే ప్రధాని పదవి వస్తుందన్న ఊహాగానాలను ఆయన తిప్పికొట్టారు. తాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించేందుకు పార్టీ బాధ్యత ఇచ్చిందని స్పష్టం చేశారు.
తాను యూపీలోని పేదలకు సేవ చేయడమే తన ధ్యేయమని, రాజకీయాలే తన పూర్తి కాల వృత్తి కాదని చెప్పారు. “తాను యోగిని మాత్రమే” అని పేర్కొంటూ, ప్రస్తుతం తన పనిలో తనకు తానే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
కేంద్ర నేతలతో విభేదాల గురించి వస్తున్న వార్తలను కొట్టి పారేశారు. “నాకు బీజేపీతో విభేదాలు ఉంటే, నేను ఇక్కడ ఉండగలనా?” అంటూ ప్రశ్నించారు. తన స్థానం పార్టీ ఇచ్చిందని, టికెట్ల విషయాన్ని పార్లమెంటరీ బోర్డు చూసుకుంటుందన్నారు.
“టైమ్ పాస్ కోసం మాట్లాడే వారి నోళ్లను ఆపలేం” అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న వదంతులపై వ్యంగ్యంగా స్పందించారు. మొత్తంగా తనను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడం అర్ధరహితమని పేర్కొన్నారు.