fbpx
Friday, January 3, 2025
HomeLife Styleయోనో ద్వారా బంపర్‌ ఆఫర్లు ప్రకటించిన ఎస్బీఐ

యోనో ద్వారా బంపర్‌ ఆఫర్లు ప్రకటించిన ఎస్బీఐ

YONO-SUPERSAVINGS-DAY-SALE-BY-SBI

ముంబై: భారత దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ‘యోనో సూపర్ సేవింగ్ డేస్’ పేరుతో స్పెషల్‌ షాపింగ్ కార్నివాల్‌ను‌ ప్రకటించింది. ఎస్బీఐ బ్యాంకింగ్, లైఫ్‌స్టైల్‌ ప్లాట్‌ఫాం అయిన యోనో మొబైల్ యాప్‌ లో షాపింగ్‌ చేసిన కస్టమర్లకు ప్రత్యేకమైన డిస్కౌంట్స్ మరియు క్యాష్‌ బ్యాక్ లను‌ అందించనుంది.

దీని కోసం షాపిం యాప్స్ అయిన అమెజాన్, ఓయో, పెప్పర్‌ఫ్రై, శాంసంగ్, యాత్రతో సహా 100కి పైగా ఇ-కామర్స్ కంపెనీలతో ఎస్‌బీఐ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు మంగళవారం ప్రకటించింది.
యోనో సూపర్ సేవింగ్ డేస్ అమ్మకం ఫిబ్రవరి 4న ప్రారంభమై ఫిబ్రవరి 7వరకు కొనసాగనుంది.

ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ట్రావెల్, హాస్పిటాలిటీ, అమెజాన్‌తో ఆన్‌లైన్ షాపింగ్ తో పాటు ఇతర ప్రముఖ విభాగాలలో కూడా యోనో సూపర్ సేవింగ్ డేస్‌ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఓయో హోటల్ ద్వారా గదుల బుకింగ్‌పై 50 శాతం తగ్గింపు, యాత్రా.కామ్‌ ద్వారా ఫ్లైట్ బుకింగ్‌పై 10శాతం తగ్గింపు, శాంసంగ్ మొబైల్స్, టాబ్లెట్‌లు గడియారాలపై 15శాతం తగ్గింపుతో పాటు ఇతర ప్రత్యేక ప్రయోజనాలను ఎస్బీఐ అందిస్తోంది.

అలాగే పెప్పర్‌ఫ్రై నుండి ఎదైనా ఫర్నిచర్ కొనుగోలు చేస్తే 7 శాతం మినహాయింపు అందనుంది. అమెజాన్‌లో ఎంపిక చేసిన వస్తువుల షాపింగ్‌పై 20 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఈ కొత్త ఏడాదిలో తమ వినియోగదారులకు మరింత ఉత్సాహాన్ని, సంతోషాన్ని అందించేందుకు యోనో సూపర్ సేవింగ్ డేస్ ప్రకటించడం ఆనందంగా ఉందని ఎస్‌బీఐ ఎండీ (రిటైల్ & డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్‌ శెట్టి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular