మూవీడెస్క్: ఈ ఏడాది దీపావళి కానుకగా తెలుగు సినీ ప్రేమికులకు పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.
ముఖ్యంగా ఈ సారి స్టార్ హీరోల కంటే, కుర్ర హీరోల పోటీ ఎక్కువగా ఉండనుంది. స్టార్ హీరోలు దీపావళికి తమ సినిమాలను విడుదల చేయడం లేదనే కారణంతో, టైర్ 2 హీరోలు ఈ ఫెస్టివల్ వీకెండ్‌కు రాబోతున్నారు.
దీపావళి పండుగ ముందు రోజున అక్టోబర్ 31న సినిమాల హంగామా మొదలుకాబోతోంది. విశ్వక్ సేన్ తన మోస్ట్ అవైటెడ్ చిత్రం “మెకానిక్ రాకీ“తో ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నాడు.
రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, కమర్షియల్ హిట్ కొట్టడం ఖాయమని విశ్వక్ నమ్మకంగా ఉన్నాడు.
అదే రోజు దుల్కర్ సల్మాన్ నటించిన “లక్కీ భాస్కర్” కూడా విడుదల కానుంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా, మిడిల్ క్లాస్ వివాహితుడిగా దుల్కర్ ప్రేక్షకులను అలరించబోతున్నాడు.
సాంగ్స్, టీజర్‌కు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కోలీవుడ్ నుంచి శివ కార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన “అమరన్” కూడా అక్టోబర్ 31న విడుదల కానుంది.
సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథాంశంతో తెరకెక్కింది.
మురుగదాస్ కు గత కొంతకాలంగా సరైన హిట్ లేవు, దీంతో ఈ సినిమాపై ఆయన చాలా ఆశలతో ఉన్నాడు.
దీపావళి బరిలో నిలిచిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.