fbpx
Tuesday, February 11, 2025
HomeMovie NewsVD12 టైటిల్ టీజర్.. టైగర్ హింట్!

VD12 టైటిల్ టీజర్.. టైగర్ హింట్!

YOUNG-TIGER-FOR-VIJAY-VD12
YOUNG-TIGER-FOR-VIJAY-VD12

మూవీడెస్క్: టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లలో VD12 ఒకటి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ఇండియా యాక్షన్ డ్రామా విజయ్ దేవరకొండ కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలవనుంది.

ఫిబ్రవరి 12న టైటిల్ అండ్ టీజర్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది. మేకర్స్ ఇప్పటికే సినిమాపై హైప్ క్రియేట్ చేసేలా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఇస్తున్నారు.

ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ కొత్త అవతారం చూసి అభిమానులు ఫుల్ ఎగ్జైట్ అయ్యారు.

ఇక తాజాగా నిర్మాత నాగ వంశీ చేసిన ట్వీట్ మరో సంచలనానికి దారి తీశింది.

ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో టైగర్ ఎమోజీ షేర్ చేయడం గమనార్హం.

దీనికి విజయ్ దేవరకొండ లవ్ ఎమోజీతో రిప్లై ఇవ్వడం మరింత హైప్ పెంచింది.

దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో వాయిస్ ఓవర్ అందించనున్నాడా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

అలాగే హిందీ వెర్షన్‌కు రణబీర్ కపూర్ వాయిస్ ఇవ్వనున్నారని టాక్ ఉంది.

ఇది నిజమైతే, VD12కి మరింత పాన్ఇండియా హైప్ వచ్చేలా ఉంటుంది.

తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.

అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందా? అన్నది వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular