fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsవార్ 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ యాక్షన్

వార్ 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ యాక్షన్

YOUNG-TIGER-NTR-MASS-ACTION-SCENE-IN-WAR2
YOUNG-TIGER-NTR-MASS-ACTION-SCENE-IN-WAR2

మూవీడెస్క్: పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘వార్ 2’లో నటిస్తున్నారు.

‘వార్’ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

స్పై యూనివర్స్‌లో భారీ విజయం సాధించిన ‘వార్’ తర్వాత దీనిపై అంచనాలు ఆకాశాన్నంటాయి.

ఇప్పటికే ఎన్టీఆర్ ఈ సినిమాలో కీలక షెడ్యూల్ పూర్తి చేశారు. తాజాగా ముంబైకి చేరుకొని మరో షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.

ఈ సారి అంధేరీలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన సెట్‌లో పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ జరుగుతోంది.

హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నేతృత్వంలో రూపొందుతున్న ఈ ఫైట్ సీన్ ఎన్టీఆర్ పాత్రను మునుపెన్నడూ లేనంత హై రేంజ్‌లో చూపించబోతున్నారట.

ఎన్టీఆర్ 40 మందితో ఫైటింగ్ చేసే ఈ సీన్ చిత్రం హైలైట్‌గా నిలవబోతుందని ఇండస్ట్రీలో టాక్.

మొత్తానికి ‘వార్ 2’తో ఎన్టీఆర్ తన మాస్ ఇమేజ్‌ను మరింత పెంచుకుంటారు అనే నమ్మకం అభిమానుల్లో పెరుగుతోంది.

యశ్ రాజ్ ఫిల్మ్స్ సుమారు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఆలియా భట్, కియారా అద్వాణీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular