కడప: షర్మిల: టాలీవుడ్ హీరో ప్రభాస్‌తో వైఎస్ షర్మిలకు సంబంధించిన కొన్ని రూమర్స్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయం ఇప్పటికే హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిల, ఇప్పుడు మరోసారి తన వైఖరిని స్పష్టంచేశారు.
“మా పిల్లల మీద ఒట్టు వేస్తూ చెబుతున్నా, ప్రభాస్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు” అని షర్మిల అన్నారు.
అంతేగాక, తనపై తప్పుడు ప్రచారానికి వైసీపీ ప్రమేయముందని ఆరోపించారు. జగన్ తన పదవిలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఈ ప్రచారంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తన వీడియోలను చూపించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించారని షర్మిల విమర్శలు గుప్పించారు.
“జగన్ స్వార్థం కోసం నా తల్లిపై కేసులు పెట్టించారని, నా పేరు దుష్ప్రచారానికి ఉపయోగించారు” అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
గౌతమ్ అదానీ వివాదంపై కూడా షర్మిల స్పందిస్తూ, “జగన్, అదానీ మధ్య జరిగిన ముడుపుల ఆరోపణలపై ఎంక్వైరీ ఎందుకు చేయడంలేదు?” అని ప్రశ్నించారు.
అదానీతో కలిసి డీల్ మాట్లాడుకున్నారని వచ్చిన ఆరోపణలు ప్రజల ముందుకు రావాలని డిమాండ్ చేశారు. షర్మిల వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ ఆరోపణలు, విమర్శలు జగన్‌పై కొత్త ఒత్తిడిని సృష్టించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.