ఏపీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరుడు వైఎస్ జగన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి వాకౌట్ చేయడంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలకే బయటకు రావడం అర్థరహితమని, కేవలం అటెండెన్స్ కోసం మాత్రమే అసెంబ్లీకి వచ్చారా అని ఆమె ప్రశ్నించారు.
జగన్‌కు ప్రజా సమస్యల కంటే ప్రతిపక్ష హోదా ముఖ్యం అయిందని షర్మిల ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజల కోసం పోరాడే ధైర్యం లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
గవర్నర్ ప్రసంగంపై కూడా షర్మిల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్రసంగంలో ఎలాంటి స్పష్టత లేకుండా, వాస్తవాల కంటే అర్థ సత్యాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
ప్రజలు ఎదురుచూస్తున్న సూపర్ సిక్స్ హామీల అమలుపై ఎలాంటి ప్రకటన లేకపోవడం నిరాశ కలిగించిందని విమర్శించారు.