న్యూఢిల్లీ: ఏపీ మాజీ సీఎం, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేస రాజధాని అయిన ఢిల్లీలో ధార్నా చేస్తున్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం వచ్చినె 45 రోజులలోనే 30 మంది హత్య చేశారని ఆయన ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేశారు.
అలాగే, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 300 మంది ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు కూడా ధ్వంసం చేసిందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో పోలీసులు లోకేశ్ దగ్గర ఉన్న రెడ్ బుక్ ప్రకారం నడుచుకుంటున్నారని, అధికారం ఎప్పుడు ఒకరి సొత్తు కాదని, ఈ సందర్భంగా ఆయన అన్నారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి హింసా రాజకీయాలు చేయలేదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కేంద్రం ని కోరడానికి ఢిల్లీలో ధర్నా చేస్తున్నట్లు తెలిపారు.