వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీని కష్ట కాలంలో వదిలేసి వెళ్లిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని వైసీపీ హై కమాండ్ స్పష్టం చేస్తోంది.
ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ళ నాని వంటి నేతలు పార్టీని వీడటం గమనార్హం. వైసీపీ అతి తక్కువ కాలంలోనే రాజకీయంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న పార్టీగా నిలిచింది.
ప్రస్తుతం పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యిందని, ఈ కష్టకాలంలో వెనక్కి వచ్చే నేతలకు పార్టీ గేట్లు మూసుకుందన్న వాదన వినిపిస్తోంది. కష్ట సమయంలో పార్టీని వదిలి వెళ్లిన వారిని మళ్లీ ఆహ్వానించాల్సిన అవసరం లేదని, పార్టీని వదిలిన వారిని తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని హై కమాండ్ దృఢంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే, ఇతర రాజకీయ పార్టీల నుండి వచ్చే నేతల విషయంలో తమకు రాజకీయంగా బలం అందిస్తేనే వారికి అవకాశం ఇవ్వాలని వైసీపీ తుదినిర్ణయం తీసుకుంది.