fbpx
Thursday, November 21, 2024
HomeAndhra Pradeshహైకోర్టులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు భారీ ఎదురుదెబ్బ

హైకోర్టులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు భారీ ఎదురుదెబ్బ

ysrcp-ex-mp-nandigam-suresh-denied-bail-by-high-court

ఆంద్రప్రదేశ్: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు ఏపీ హైకోర్టులో అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. 2020లో జరిగిన మరియమ్మ హత్య కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని సురేశ్ పిటిషన్ వేశారు. అయితే, ఈ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది.

గతంలో ఈ కేసులో బెయిల్ కోరుతూ గుంటూరు కోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది.

కేసు నేపథ్యానికి వస్తే, తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020లో రెండు సామాజికవర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో ఈ హింసాత్మక ఘర్షణలో మరియమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. మరియమ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఈ కేసులో నందిగం సురేశ్‌ను 78వ నిందితుడిగా పోలీసులు చేర్చారు. గుంటూరు కోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో, సురేశ్ హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు విచారణలో భాగంగా ఈ పిటిషన్‌ను తిరస్కరించడంతో సురేశ్‌కు బెయిల్ ఆశలు నిరాశలో ముగిశాయి.

ఈ తాజా పరిణామం నందిగం సురేశ్‌కు చట్టపరమైన క్లిష్ట పరిస్థితిని తలపెట్టింది. అలాగే ఆంద్రప్రదేశ్ వైసీపీ పాలిటిక్స్ లో మరింత హాట్ టాపిక్ గా మారింది. మరి జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular