ఏపీ: సినీ నటుడు, వైసీపీ నేత అల్లూరి కృష్ణం రాజు (కృష్ణుడు) బుధవారం రాత్రి వైఎస్ జగన్ ను తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోను కృష్ణుడు స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో కృష్ణుడు మేకోవర్ అందరిని ఆశ్చర్యపరిచింది.
సినీ కెరీర్‌లో ఎక్కువగా కమెడియన్ గా రాణించిన కృష్ణుడు, కొన్నాళ్లు హీరోగా కూడా ప్రయత్నించారు. అయితే సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ, వైసీపీ లో కూడా ఆయన తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. పార్టీలో అత్యంత విశ్వసనీయ నేతగా గుర్తింపు పొందారు.
కృష్ణుడు చించినాడ కేంద్రంగా పాలించిన జమిందారీ కుటుంబం కి చెందినవారు. వారి కుటుంబం 1970లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వల్ల 4,500 ఎకరాల భూమి కోల్పోయింది. ఈ విషయం చాలా మందికి తెలియదు.
ఇప్పుడు రాజకీయంగా మళ్లీ ఆక్టివ్ అవుతుండటంతో, కృష్ణుడు భవిష్యత్తులో వైసీపీ తరఫున మరింత ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది.