వైసీపీ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి ఎన్నికల ఓటమి తరువాత వరుస సమస్యలు ఎదురవుతున్నాయి. కీలక నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరడం, కొంతమంది సైలెంట్‌గా ఉండిపోవడం, మరికొందరు కొత్త అవకాశాల కోసం ఎదురుచూడడం పార్టీని సంక్షోభంలోకి నెట్టేస్తోంది.
ఈ పరిస్థితుల్లో పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం సమస్యలను పట్టించుకోనట్టు కనిపిస్తున్నారు. ఇప్పుడు మరో షాకింగ్ పరిణామం తెరపైకి వచ్చింది. ఓటమి తర్వాత పార్టీ కార్యాలయాలు ఒకటిన్నొక్క తొలగించబడుతున్నాయి.
ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు తమ ఇంట్లో ఏర్పాటు చేసిన కార్యాలయాలను మూసివేయడం గమనార్హం. విజయవాడ సెంట్రల్‌లో పూనూరు గౌతం రెడ్డి తన ఇంటిని పార్టీకార్యాలయంగా మార్చారు. కానీ, తాజాగా ఆ కార్యాలయాన్ని తీసివేసి ఇంటిని అద్దెకిచ్చేశారు.
అలాగే, గుంటూరు, కుప్పం వంటి ప్రాంతాల్లోనూ కార్యాలయాలు మూసివేయబడటం జరిగింది. గుంటూరులో నాలుగు కార్యాలయాలను తొలగించగా, కుప్పంలో పార్టీ ఆఫీస్ స్థానంలో హోటల్ ప్రారంభమైంది. మరికొన్ని ప్రాంతాల్లో అద్దె భారాన్ని తట్టుకోలేక కార్యాలయాలను కుదించే పనిలో ఉన్నారు.
వైసీపీకి ఎదురవుతున్న ఈ పరిణామాలు పార్టీ లోపలి అస్థిరతను ఎత్తిచూపుతున్నాయి. నాయకత్వానికి మద్దతు లేమి, ఆర్థిక భారాలు ఇలా ప్రతి కోణంలోనూ పార్టీ కష్టాలను ఎదుర్కొంటోంది.