ఏపీ: విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో చేదు అనుభవం ఎదురైంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) 6వ వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక తన పదవికి రాజీనామా చేశారు. ఆమె మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె కావడం గమనార్హం.
ఇటీవల పార్టీకి ఎదురవుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ రాజీనామా కలకలం రేపుతోంది. లక్ష్మీ ప్రియాంక పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపిన లేఖలో వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్టు వెల్లడించారు.
అయితే ఇది నిజంగా వ్యక్తిగతమా? లేక రాజకీయం లోపలి వ్యూహమా? అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ పరిణామంతో జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం మరింత ఉత్కంఠకు తావిస్తోంది.
ఇప్పటికే కార్పొరేటర్లను క్యాంప్‌లకు తరలించిన వైసీపీ.. మరిన్ని రాజీనామాలు వస్తాయనే అనుమానంతో అలెర్ట్ అయింది. పార్టీ నేతల్లో అసంతృప్తి బహిర్గతమవుతున్నట్లు స్పష్టమవుతోంది.
మంత్రి బొత్స సత్యనారాయణ అవిశ్వాసం వెనుక టీడీపీ కుట్ర ఉందని ఆరోపించారు. అయితే ప్రియాంక రాజీనామా నేపథ్యంలో ఈ ఆరోపణలు వాస్తవంగా నిలుస్తాయా? అన్నదానిపై ప్రజల్లో చర్చ మొదలైంది.
ysrcp, avanti srinivas, visakhapatnam, mayor no confidence, priyanka resignation,