న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి అతిశీకి జెడ్ కేటగిరీ భద్రత ను పోలీసులు కేటాయించారు.
కాగా, సీఎం కాన్వాయ్‌లో ఒక పైలట్‌తో సహా పోలీసు సిబ్బందితో భద్రతను కల్పించినట్లు సదరు అధికారులు తెలిపారు.
అమలు లో ఉన్న ప్రోటోకాల్ ప్రకారం, కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఢిల్లీ సీఎం జెడ్ కేటగిరీ భద్రతకు అర్హులు.
జెడ్ కేటగిరీ భద్రత కోసం 22 మంది సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా పని చేస్తారు. జెడ్ కేటగిరీ భద్రతలో పీఎస్వోలు, ఎస్కార్ట్స్, సాయుధ గార్డులు ఉంటారు.
అతిసీ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక ఢిల్లీలో అసంఘటిత రంగ కార్మికుల జీతాన్ని పెంచుతూ ప్రభుత్వం తొలి నిర్ణయం తీసుకున్నది.
ఈ కొత్త వేటనం అమలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని అతిశీ ప్రకటించారు.
ఈ తాజా నిర్ణయంతో నైపుణ్యం లేని కార్మికుల కనీస వేతనం రూ.18,066, మధ్యస్త నైపుణ్యం కలిగిన వారి వేతనం రూ.19,929, మరియు మెరుగైన నైపుణ్యం కలిగిన వారికి వేతనం రూ.21,917గా అందనుంది.