టాలీవుడ్: ‘అ!‘,’కల్కి’ వంటి సినిమాలతో తన టేకింగ్ తో కథనం తో ప్రత్యేకత చాటుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ డైరెక్టర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘జాంబీ రెడ్డి’. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకు ఫ్యాక్షన్ కథలని చూసాం కానీ ఈ సారి జాంబీ కథని చూడబోతున్నాం. కరోనా ని, జాంబీ ని , రాయలసీమ ఫ్యాక్షన్ ని ఇలా మూడు ఎలెమెంట్స్ ని జోడించి వాటి ఆధారంగా కామెడీ ని, ఫైట్స్ ని రూపొందించారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ఇవాల విడుదల అయింది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
ప్రధాన మంత్రి మోడీ లాక్ డౌన్ ప్రకటన తో ట్రైలర్ మొదలవుతుంది. కరోనా టైం లో లాక్ డౌన్ పెట్టినా కూడా జనాలు బయట ఎలా తిరిగారు లాంటి సీన్స్ కొన్ని పెట్టి ఆ తర్వాత ఒక స్నేహితుడి పెళ్లి కోసం కరోనా టైం లో రాయలసీమ వచ్చిన హీరో ని చూపిస్తారు. రాయలసీమ లో కరోనా వైరస్ జాంబీ లాగా రూపాంతరం చెంది జాంబీ లుగా మారిన మనుషులు మిగతా వాళ్ళని ఎలా చంపుతున్నారు వాటిని హీరో మరియు హీరో ఫ్రెండ్స్ ఎలా ఎదుర్కొన్నారు అనేది మిగతా కథనం అని అర్ధం అవుతుంది. ఈ జాంబీ కరోనా కాంబినేషన్ ని ప్రశాంత్ వర్మ అద్భుతం గా వాడుకుని కామెడీ ని, యాక్షన్ సీక్వెన్స్ ని బాగానే రూపొందించినట్టు ట్రైలర్ ద్వారా అర్ధం అవుతుంది. చివర్లో ‘సంక్రాతి కి అల్లుళ్ళు వస్తారు ఈసారి జాంబీ లు వచ్చాయి రో’ అంటూ ట్రైలర్ ముగించారు.
బాల నటుడిగా చాలా సినిమాలు చేసిన తేజ సజ్జ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. తేజ కి జోడీ గా ఆనంది, దక్ష నాగర్కర్ నటిస్తున్నారు. ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. ట్రైలర్ చూస్తే ఆ విషయం స్పష్టం గా తెలుస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ని ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేసారు. సంక్రాంతి కి వస్తున్నట్టు హింట్ ఇచ్చారు కానీ ఖచ్చితమైన రిలీజ్ డేట్ అయితే ప్రకటించలేదు. మరి కొద్దీ రోజుల్లో ఆ విషయం కూడా సినిమా టీం ప్రకటించనున్నారు.