టాలీవుడ్: గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ నుండి వైవిధ్యమైన సినిమాలు వస్తున్నాయి. ఒకప్పుడు కొత్త రకమైన సినిమాలు అంటే తమిళ్ సినిమాల వైపు చూసే వారు. ఇపుడు టాలీవుడ్ లో కూడా కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి అలాంటి సినిమాలు వేరే భాషల్లో కూడా రీ మేక్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఇండియా మూవీ లో జాంబీ జానర్ లో కేవలం రెండే సినిమాలు వచ్చాయి. తెలుగు లో ఇంతవరకు ఈ క్యాటగిరి లో ఏ సినిమా రాలేదు. ప్రస్తుతం తెలుగు లో జాంబీ రెడ్డి అనే సినిమా రూపొందుతుంది. కరోనా మరియు జాంబీ జానర్ లో ఈ సినిమా రూపొందుతుంది.
‘అ!’ ‘కల్కి’ లాంటి వైవిధ్యమైన సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ‘ప్రశాంత్ వర్మ’ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంద్ర సినిమాలో జూనియర్ ఇంద్ర సేనా రెడ్డి గా నటించి మెప్పించి ఈ మధ్యనే ఓ బేబీ సినిమాలో సమంత మనవడి పాత్రలో నటించిన తేజ సజ్జ ఈ సినిమాలో హీరోగా మన ముందుకి వస్తున్నాడు. ఇతనికి జోడీ గా దక్ష మరియు తెలుగు నటి అయ్యి ఉండి తమిళ్ లో ఎక్కువ పేరు తెచ్చుకున్న ఆనంది నటిస్తున్నారు. కర్నూల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ బైట్ ని ఇవాల సమంత చేతుల మీదుగా విడుదల చేయించారు.
‘దైవం మనుష్య రూపేణా అన్నది ఇతిహాసం.. రాక్షసం మనుష్య రూపేణా అన్నది ప్రస్తుతం’ అంటూ ఈ ఫస్ట్ బైట్ వీడియో ప్రారంభం అయింది. బ్యాక్ డ్రాప్ లో ఒక గబ్బిలం ని చూపిస్తారు. కరోనా కి మూలం ఎక్కడ అనేది దాని అర్ధం అయి ఉంటుంది. భగవంతుని సృష్టిలో ఒకే ఒక పొరపాటు మనిషి మేధస్సు చివరికి ఆ మేధా శక్తే మనిషికి ప్రశ్నగా నిలిస్తే భగవంతుడు నేర్పే పాఠం అంటూ చెప్పే బ్యాక్ గ్రౌండ్ డైలాగ్స్ తో జాంబీ సీన్స్ తో టీజర్ ఆకట్టుకుంది. ఫస్ట్ బైట్ లో కరోనా వైరస్ ప్రారంభం గురించి, వాక్సిన్ గురించి , జాంబీ అవతారంలో ఉన్న ప్రజల కొన్ని సీన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ బైట్ ప్రకారం టెక్నికల్ గా, సినిమాటోగ్రఫీ , మ్యూజిక్ పరంగా ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. కేవలం కాన్సెప్ట్ పరంగా మాత్రమే కాకుండా కమర్షియల్ అంశాలు కూడా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇక చివర్లో కరోనా కేవలం ప్రారంభం మాత్రమే అంటూ మున్ముందు మనిషి వల్లనే ఇంకా చాలా ప్రమాదాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నట్టు చెప్పారు.