టాలీవుడ్ : ఇండస్ట్రీ కి వచ్చిన కొత్త లోనే మొదటి రెండు సినిమాలుగా ‘అ!’, ‘కల్కి’ లాంటి విభిన్న చిత్రాలతో టాలీవుడ్‌లో ప్రత్యేకతను చాటుకున్నాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఈయన తీస్తున్న సినిమా టైటిల్ ఇవాళ ప్రకటించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరి నేపథ్యంలో తెలుగులో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు లో జాంబీ జానర్ లో ఇదే మొదటి సినిమా. వాస్తవ సంఘటనల ఆధారంగా కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయం నేపథ్యంలో హారర్ అంశాలతో ఇది రూపొందుతోంది. రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
జాంబీ మూవీస్ అనగానే హాలీవుడ్ లో చాలా సినిమాలే గుర్తొస్తాయి. ఒక వైరస్ సోకి ప్రజలందరూ రక్తం తాగడానికి ఊరి మీద పడే పరిస్థితులు నెలకొంటాయి. వాటినుండి మామూలు ప్రజలు ఎలా బయట పడతారు అనేది థీమ్ గా హాలీవుడ్ లో చాలా సినిమాలే వచ్చాయి. ఇలాంటి కథలు ఇండియన్ సినిమాకి కొత్తవి. ఈ జానర్ లో ఒకటీ అర సినిమాలు వచ్చినప్పటికీ అవి అంతగా ఆడలేదు. తమిళ హీరో జయం రవి నటించిన ‘జాంబీ’ అని ఒక సినిమా వచ్చింది కానీ అంతగా గుర్తింపు రాలేదు. హిందీ లో ‘గో గోవా గాన్’ అనే సినిమా కొంచెం జాంబీ థీమ్ ఉన్నా కూడా అది కామెడీ సినిమాలాగే అలరించింది.
టైటిల్ ఆసక్తి కరంగా ఉన్నప్పటికీ ఇది కూడా కొంచెం కామెడీ లానే అనిపిస్తుంది. అలాగే ఈ టైటిల్ ఒక సామాజిక వర్గం ఉద్దేశించి సినిమాకి హైప్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్య ఇలాంటి గొడవల వల్ల చాలా సినిమాలు చివరి నిమిషంలో టైటిల్స్ మార్చుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ జాంబీ జానర్ లో వస్తున్న మొదటి తెలుగు సినిమాగా ఈ సినిమా రెకార్డుకెక్కుతుంది. అలాగే ప్రశాంత్ వర్మ ట్రాక్ రికార్డ్ చూసిన కూడా థ్రిల్లర్ కథలని చక్కగా హ్యాండిల్ చేయగలదని నిరూపించాడు.